Amanagallu: అమనగల్ గర్ల్స్ హైస్కూల్‌లో మహిళా భద్రత అవగాహన సదస్సు
Amanagallu: అమనగల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గర్ల్స్ హైస్కూల్‌లో మహిళా భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించి, విద్యార్థినులతో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు.
Amanagallu: అమనగల్ గర్ల్స్ హైస్కూల్‌లో మహిళా భద్రత అవగాహన సదస్సు
అమనగల్: రంగారెడ్డి జిల్లా అమనగల్ మండల కేంద్రంలో “ఆడపిల్లలను పుట్టనిద్దాం – చదవనిద్దాం – ఎదగనిద్దాం” అనే నినాదంతో అమనగల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం అమనగల్ గర్ల్స్ హైస్కూల్‌లో మహిళా భద్రత అవగాహన కార్యక్రమం, ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులకు మహిళలు, బాలికల భద్రత, ఈవ్‌టీజింగ్, వేధింపులు, పోక్సో చట్టం తదితర అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని, మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
అనంతరం విద్యార్థినులు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల కోసం పండుగలు, ప్రత్యేక సందర్భాల్లోనూ విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను విద్యార్థినులు అభినందించారు. అలాగే సమాజ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను కూడా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్‌హెచ్‌ఓ ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ఎ. సంతోష్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. మహిళలు, బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు.




