Amanagal: ఆమనగల్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు, సారా స్వాధీనం

Amanagal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ఎక్సైజ్ పరిధిలో విస్తృత తనిఖీలు. 8 లీటర్ల అక్రమ సారా స్వాధీనం, ఒకరు అరెస్ట్. కఠిన చర్యలుంటాయని అధికారుల హెచ్చరిక.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 12 Aug 2026 11:28 PM IST
Amanagal
X

Amanagal: ఆమనగల్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు, సారా స్వాధీనం

ఆమనగల్: ఆమనగల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, పరిధిలోని నాలుగు మండలాల్లో ప్రజలకు మత్తు కలిగించే పదార్థాలను అక్రమంగా విక్రయిస్తున్నారు అనే అంశంపై బుధవారం అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, ధాబాలు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.ధాబాలు, హోటళ్లలో అక్రమంగా మద్యం విక్రయించడం, అనుమతి లేకుండా మద్యం తాగించడం లేదా విక్రయించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

అదేవిధంగా కిరాణా దుకాణాల్లో మద్యం విక్రయించినా, అక్రమ సారా తయారీకి ఉపయోగించే బెల్లం, నల్లబెల్లం, పటిక తదితర పదార్థాలను అక్రమంగా నిల్వ ఉంచినా లేదా విక్రయించినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా కడ్తాల్ మండలం చరికొండ గ్రామం నుంచి అక్రమంగా సారా సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

అతని వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 8 లీటర్ల అక్రమ సారాను సీజ్ చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. సారాయి, అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలు లేదా గంజాయి, మాదక ద్రవ్యలు ప్రభుత్వం నిషేదించినా మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు ప్రజలు గమనించినట్లయితే వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.

వివిధ కేసు లో పట్టుబడిన నిందుతులను కడ్తాల్ ఎమ్మార్వో కార్యాలయం, మాడుగుల ఎమ్మార్వో కార్యాల బౌండోవర్ చేయటం జరిగింది పోలీసులు తెలిపారు.ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆమనగల్ స్టేషన్ సీఐ బాధ్యనాథ్ చౌహన్, ఎస్సై అరుణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ చెన్నయ్య, ఈసీలు రాంరెడ్డి,శ్రీను,లత,శివ, ఎస్సై ప్రసాద్,ఈసీ సాయి శ్రీజ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story