Hyderabad: కుత్బుల్లాపూర్ డిగ్రీ కళాశాలలో ఉచిత నోట్‌బుక్స్‌ పంపిణీ

Hyderabad: కుత్బుల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్షర కౌముది సంస్థ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ. హాజరైన వ్యవస్థాపకులు.

Bodike Manohar, Malkajgiri
Published on: 7 Aug 2026 4:39 PM IST
Hyderabad
X

Hyderabad: కుత్బుల్లాపూర్ డిగ్రీ కళాశాలలో ఉచిత నోట్‌బుక్స్‌ పంపిణీ

హైదరాబాద్: సమాజ సేవలో అక్షర కౌముది సంస్థ ఎప్పుడు ముందుంటుంది అలాగే నేటి బాలలే రేపటి పౌరులు విద్యార్థుల భవితను నిర్దేశించే శక్తి కేంద్రాలు కళాశాలలు అని అక్షర కౌముది సంస్థ అధ్యక్షురాలు తులసి విజయలక్ష్మివెంకట రమణా చార్యులు అన్నారు.

శుక్రవారం అక్షర కౌముది సంస్థ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అక్షర కౌముది సంస్థ, దాతల సహకారంతో ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా తులసి వెంకట రమణా చార్యులు మాట్లాడుతూ తమ సంస్థ గత ఆరు సంవత్సరాలుగా సాహిత్య ,సామాజిక సాంస్కృతిక రంగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్స్ అందచేసాము అని అన్నారు.

డిగ్రీ కళాశాలలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ దాతల సమక్షంలో కళాశాల ఉపప్రదానాచార్యులు డా శ్రీధర్ సీనియర్ ప్యాకల్టీ డా సునీత ,డా శ్యామ్ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

సంస్థ ఆధ్వర్యంలో మును ముందు విద్యార్థులకు అనేక పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తూ విద్యార్థులను ప్రోత్సహించే అనేక కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇట్టి సద్ అవకాశం కల్పించిన కళాశాల అధ్యాపక బృందం అందరికీ సంస్థ పక్షాన వినమ్ర నమస్సులు తెలియ జేస్తూన్నాము.

కళాశాల ఉప ప్రధాన చార్యులు డా శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ఎక్కువ మంది పేద విద్యార్థులు ఉంటారు వారికి ప్రభుత్వం పరంగా కొన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ ఇంకా మెరుగైన విద్యా ను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో అక్షర కౌముది సంస్థ వంటి అనేక స్వచ్ఛంద సంస్థలు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం మరియు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభ ను వెలికతీసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడం హర్ష దాయకం అన్నారు.

ఈకార్యక్రమంలో అక్షర కౌముది సంస్థ కోశాధికారి బచ్చలి మాధవి, సభ్యులు సూర్య కుమారి,దుర్గా భవాని, సుబ్బారావ్ , కొండా లలిత, కళాశాల ఉప ప్రధానాచార్యులు డా శ్రీధర్ , అధ్యాపక బృందం డా శ్యామ్, డా సునీత, రజిత, అనిల, మానస, అనిత, డా లక్ష్మణ్ , కె పార్థ సారథి, డా లక్ష్మణ్, రజనీకాంత్ , నర్సయ్య ,వెంకటేశ్వర్లు, సైదయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story