Hyderabad: మై భారత్" రిజిస్ట్రేషన్లపై అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి రివ్యూ

Hyderabad: కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి 'మై భారత్' రిజిస్ట్రేషన్లపై సమీక్ష నిర్వహించారు, జిల్లాలో ఇప్పటివరకు 59,427 మంది నమోదయ్యారని వెల్లడించారు.

G. Rama Krishna, Hyderabad
Published on: 29 July 2026 9:55 PM IST
Hyderabad
X

Hyderabad: మై భారత్" రిజిస్ట్రేషన్లపై అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి రివ్యూ

హైదరాబాద్: బుదవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నందు మై భారత్ (MY Bharat) హైదరాబాద్ కేంద్రం జిల్లా సలహా కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగుతున్న మై భారత్ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టి జిల్లాలోని యువత, ముఖ్యంగా విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థల సమన్వయంతో యువతను నమోదు చేయించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు.విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియను పర్యవేక్షించి విజయవంతంగా పూర్తి చేయడానికి ఆయా విద్యాసంస్థల ఫిజికల్ డైరెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి శశాంక్ మాట్లాడుతూ, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ (మేరా యువ భారత్) దేశ యువతకు డిజిటల్, ప్రత్యక్ష వేదికలను సమన్వయం చేసే "ఫిజిటల్" వేదిక అని తెలిపారు. యువతకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, నాయకత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, సమాజ సేవ, యువజన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలను కల్పిస్తూ, దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం దీని ప్రధాన లక్ష్యమని వివరించారు.దేశవ్యాప్తంగా ఇప్పటికే 2.2 కోట్లకు పైగా యువత మై భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని, హైదరాబాద్ మై భారత్ కేంద్రం పరిధిలో 59,427 మంది యువత నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్ రావు, ఇంచార్జ్ డి పి ఆర్ ఓ హబీబుద్దీన్, జిల్లా పర్యాటక అధికారి ప్రభాకర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ సెల్ సమన్వయకర్త డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎన్‌సీసీ ప్రతినిధి లెఫ్టినెంట్ ఉర్మిళ,లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రతినిధి ప్రదీప్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ నాయక్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad

Next Story