Secunderabad: సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ 1000 రోజుల పాలన సంబరాలు!
Secunderabad: సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ 1000 రోజుల పాలన వేడుకలను కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. బిఆర్ఎస్ విమర్శలపై మండిపడ్డారు.
Secunderabad: సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ 1000 రోజుల పాలన సంబరాలు!
Secunderabad: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.
నియోజకవర్గంలోని 8 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయా డివిజన్ల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ర్యాలీలుగా బయలుదేరి సీతాఫల్మండి అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు.
అక్కడి నుంచి ర్యాలీగా ముందుకు సాగిన కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించగా, ఆదం సంతోష్ కుమార్ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు వివరించిన ఆదం సంతోష్. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.
పేద కుటుంబాల సంక్షేమం కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల పెంపు, సన్న బియ్యం పంపిణీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు ఉపాధి హామీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
“ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నాం” అని ఆదం సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ నేతలకు పని లేకే విమర్శలా?
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకోవడం చూసి టీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేక ప్రజలను మభ్యపెట్టేందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని ఆదం సంతోష్ కుమార్ విమర్శించారు.
“రేవంత్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అబద్ధాలు, కల్లబొల్లి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు” అని ఆయన అన్నారు.
“పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్‌కు ఏం చేశారు?”
సికింద్రాబాద్ నియోజకవర్గంలో పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన పద్మారావు గౌడ్‌పై ఆదం సంతోష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.
“సికింద్రాబాద్ ప్రజలకు అవసరమైన కమర్షియల్ కార్యకలాపాలు, సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయం, రోడ్ల విస్తరణ వంటి సమస్యలపై తగిన అభివృద్ధి కనిపించలేదు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన రేషన్ కార్యాలయాన్ని కూడా నాంపల్లికి తరలించిన ఘనత గత పాలకులదే” అని విమర్శించారు.
“పదేళ్లు అధికారంలో ఉండి సికింద్రాబాద్ అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలి. కుటుంబ సభ్యుల రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజలకు కనిపించే స్థాయిలో అభివృద్ధి ఏమి చేశారో సమాధానం చెప్పాలి” అని ఆదం సంతోష్ కుమార్ ప్రశ్నించారు.
“అబద్ధాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి”
టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఖండించాలని ఆదం సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
“ప్రజల మధ్యకు వెళ్లి వాస్తవాలను వివరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలి. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని ధైర్యంగా తిప్పికొట్టాలి” అని అన్నారు.
రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు సాగుతూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని ఆదం సంతోష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
“1000 రోజుల కాంగ్రెస్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల ఆశీస్సులతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత దూసుకుపోతుంది. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త దిశ చూపుతుంది” అని ఆదం సంతోష్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ ర్యాల రాజేంద్ర యాదవ్, జలంధర్ రెడ్డి, అమర్నాథ్ గౌడ్, సందీప్ సందీప్, గండికోట కుమార్,శిల్పా చారి, అనిల్, హైజ, సతీష్, మహేందర్, జగిర్, అనుర్ధిన్, నజీర్, శశాంక్, పాల్గొన్నారు.




