Uppal: ఉప్పల్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి PHT షాపింగ్ మాల్ ప్రారంభం!

Uppal: ఉప్పల్‌లో PHT షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన హీరోయిన్ శ్రీలీల. అభిమానుల భారీ రాకతో సందడి నెలకొన్న షాపింగ్ మాల్ ప్రాంగణం.

KARUNAKAR, UPPAL
Published on: 16 Aug 2026 5:11 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి PHT షాపింగ్ మాల్ ప్రారంభం!

Uppal: ఉప్పల్‌ లో పీహెచ్‌టీ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ సినీనటి, హీరోయిన్‌ శ్రీలీల సందడి చేశారు. మేనేజింగ్‌ పార్ట్‌నర్స్‌ గడ్డం వెంకటేష్‌, చిరాన్దాసు ధనుంజయ్‌, వనం నరసింహ, గోషిక కృష్ణ, గుజ్జా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరై మాల్‌ను ప్రారంభించారు.

శ్రీలీల రాకతో ఉప్పల్‌ బస్టాప్‌ పరిసరాలు అభిమానులతో కిక్కిరిశాయి. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మాల్‌ ప్రాంగణంలో సందడి నెలకొంది. అభిమానులు శ్రీలీలతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ప్రారంభోత్సవంలో భాగంగా శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు.

అనంతరం మాల్‌లోని వివిధ విభాగాలను సందర్శించి పట్టు వస్త్రాలు, చీరలు, ఇతర వస్త్రాలను పరిశీలించారు. పీహెచ్‌టీ షాపింగ్‌ మాల్‌లో అందుబాటులో ఉన్న వస్త్రాల ప్రత్యేకతలు, వివిధ విభాగాల వివరాలను నిర్వాహకులు ఆమెకు వివరించారు. మాల్‌ ఏర్పాటుపై శ్రీలీల నిర్వాహకులను అభినందించారు. అనంతరం అభిమానులతో కలిసి శ్రీలీల ఫొటోలు దిగుతూ సందడి చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప్పల్‌లో పీహెచ్‌టీ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి హాజరుకావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తనపై స్థానికులు, అభిమానులు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలీల సందడి, అభిమానుల భారీ రాకతో పీహెచ్‌టీ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం ఉప్పల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story