Ibrahimpatnam: రహదారులపై ధాన్యం ఆరబెడితే కఠిన చర్యలు తప్పవు!
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని రహదారులపై ధాన్యం ఆరబెట్టే వారిపై కేసులు నమోదు చేస్తామని ఏసీపీ కేవీపీ రాజు హెచ్చరించారు.
Ibrahimpatnam: రహదారులపై ధాన్యం ఆరబెడితే కఠిన చర్యలు తప్పవు!
ఇబ్రహీంపట్నం: డివిజన్ యాచారం మంచాల మండల ప్రాంతాలలోని రైతులకు ఏసీపి కేవీపీ రాజు సూచనలు చేశారు. రోడ్లపై వడ్ల కుప్పలు – వాహనదారులకు ప్రాణాపాయం. రహదారులపై వడ్ల రాశులు నిల్వ ఉంచడం లేదా ఇతర ధాన్యాలను ఆరబెట్టడం వల్ల ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనదారులకు అవి స్పష్టంగా కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం కూడా సంభవిస్తున్నదని హెచ్చరించారు. రోడ్లపై ధాన్యాలు ఆరబెట్టే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ రహదారులపై ధాన్యం ఆరబెట్టవద్దని. ఇబ్రహీంపట్నం ఏసిపి సూచించారు.
Next Story




