Abdullapurmet: సురవరం సుధాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రావి నారాయణరెడ్డి కాలనీలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి.
Abdullapurmet: సురవరం సుధాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
అబ్దుల్లాపూర్‌మెట్: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రావి నారాయణరెడ్డి కాలనీ ఫేజ్–3 పోరాట కేంద్రంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, సీపీఐ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి గారి ప్రధమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌రెడ్డి గారి చిత్రపటానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, మహిళా సమైక్య నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొని సురవరం సుధాకర్‌రెడ్డి గారి సేవలను స్మరించుకున్నారు.
Next Story




