Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమీక్ష

Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీపీ ఆఫీస్‌లో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమీక్ష. అభివృద్ధి పనులు, తాగునీరు, ఇందిరమ్మ ఇళ్లపై అధికారులకు సూచనలు.

AJAY, HAYATH NAGAR
Published on: 31 July 2026 3:50 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమీక్ష

అబ్దుల్లాపూర్‌మెట్: అబ్దుల్లాపూర్‌మెట్అబ్దుల్లాపూర్‌మెట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు.

ముఖ్యంగా తాగునీటి సమస్య, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతుల సమస్యలు, గ్రామాల అభివృద్ధి పనులు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు.

ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో మండల అధికారులు, తహసీల్దార్ (ఎమ్మార్వో), ఎంపీడీవో, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story