Nagole: పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష!

Nagole: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు ఉప్పు రాకేష్‌కు ఎల్‌బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించింది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 17 Aug 2026 7:01 PM IST
Nagole
X

Nagole: పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష!

నాగోల్: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోక్సో కేసులో నిందితుడు ఉప్పు రాకేష్‌ (24)కు ఎల్‌బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడిపై రూ.3 వేల జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.50 వేల పరిహారం అందించాలని ఆదేశించింది.

నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్‌ 405/2025లో బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 78, పోక్సో చట్టంలోని సెక్షన్‌ 11 రెడ్ విత్ 12 కింద కేసు నమోదైంది. నాగోల్ ఎస్‌ఐ పి. శివ నాగ ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. ప్రాసిక్యూషన్‌ తరఫున అదనపు పీపీలు శోభారాణి, పి. సత్యనారాయణ వాదనలు వినిపించారు. మైనర్ బాలికల భద్రతకు ముప్పుగా మారే చర్యలపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story