Mansoorabad: ఎల్బీనగర్ మన్సూరాబాద్ లో రోడ్డుపై 12 కాలనీల వాసుల ఆందోళన

Mansoorabad: కాలనీల్లోకి వరద కాలువల ద్వారా వస్తున్న డ్రైనేజీ నీరు, ఆటోనగర్ ఫ్యాక్టరీల నుండి వస్తున్న ప్రమాదకర కెమికల్ వాటర్‌తో స్థానిక నివాస ప్రాంతాలు నరకప్రాయంగా మారాయి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 7 Jun 2026 12:08 PM IST
Mansoorabad
X

Mansoorabad: ఎల్బీనగర్ మన్సూరాబాద్ లో రోడ్డుపై 12 కాలనీల వాసుల ఆందోళన

మన్సూరాబాద్: కాలనీలోకి వర్షపు నీరు బాక్స్ డ్రైన్ లో డ్రైనేజ్ నీరు,ఆటో నగర్ నుండి వస్తున్న కెమికల్ వాటర్ తో కాలనీల రోడ్లపై డ్రైనేజ్ పారుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని 12 కాలనీల వాసులు ఆందోళనకు దిగారు. ఏలుగా ఈ సంవత్సరం అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీస కనికరం లేకుండా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రోజు రోడెక్కి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీల్లో పారుతున్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, వర్షపు నీటి బాక్స్ డ్రెయిన్‌లో డ్రైనేజీ నీరు, కెమికల్ వ్యర్థ జలాలను కలపడం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వేసవికాలంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాబోయే వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటిక ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించలేదన్నారు.

వరద కాలువలో ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరు, కెమికల్ వ్యర్థ జలాల కారణంగా 12 కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దుర్వాసనతో రోజువారీ జీవనం ఇబ్బందికరంగా మారడంతో పాటు చర్మవ్యాధులు, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోయారు.

తమ సమస్యను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని, లేదంటే మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని కాలనీవాసులు హెచ్చరించారు. వర్షపు నీటి కాలువలను కేవలం వర్షపు నీటి పారుదలకే వినియోగించేలా చర్యలు తీసుకుని, డ్రైనేజీ మరియు కెమికల్ వ్యర్థ జలాలను ప్రత్యేక వ్యవస్థ ద్వారా మళ్లించాలని వారు డిమాండ్ చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story