Hyderabad: రైలులో 11.16 కేజీల గంజాయి స్వాధీనం!

Hyderabad: ఒరిస్సా నుండి హైదరాబాద్‌కు రైలులో తరలిస్తున్న 11.16 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 6 లక్షలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Aug 2026 3:47 PM IST
Hyderabad
X

Hyderabad: రైలులో 11.16 కేజీల గంజాయి స్వాధీనం!

Hyderabad: ఒరిస్సా ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు రైల్లో గంజాయి వస్తుందనే సమాచారం మేరకు రంగారెడ్డి ఎస్‌ఫోర్స్‌మెంట్ సీఐ బాలరాజు సిబ్బంది కలిసి తాండూరు నుంచి సికింద్రాబాద్‌కు వరకు లోక్‌మాన్య తిలక్ రైల్లో తనిఖీలు చేపట్టారు. రైల్లో అనుమానంగా ఉన్న బ్యాగులను తనిఖీలు చేయగా 11.16 కేజీల గంజాయి లభించినట్లు రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ బి.జ్యోతి కిరణ్ తెలిపారు.

గంజాయిని తీసుకురా వచ్చిన వ్యక్తి ఎవరనేది మాత్రం రైల్లో గుర్తించబడలేదు తనిఖీలను చూసిన నిందితుడు తప్పించుకుంటాడని ఎక్సైజ్ పోలీసులు అంచనా వేశారు. అన్ నోన్ కేసుగా నమోదు చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 6 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story