Natural Farming: సమగ్ర సేంద్రియ సాగుతో ఏడాదికి రూ.16 లక్షల లాభం.. ఆదర్శ రైతు విజయగాథ!

Natural Farming: సమగ్ర ప్రకృతి సాగు చేస్తూ ఏడాదికి రూ.16 లక్షలు ఆర్జిస్తున్న ఆదర్శ రైతు విజయగాథ.

Arun Chilukuri
Published on: 5 Sept 2026 2:28 PM IST
Natural Farming
X

Natural Farming: సమగ్ర సేంద్రియ సాగుతో ఏడాదికి రూ.16 లక్షల లాభం.. ఆదర్శ రైతు విజయగాథ!

Natural Farming: సాంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా సమీకృత (ఇంటిగ్రేటెడ్) ప్రకృతి సాగు చేపట్టి ఓ ఆదర్శ రైతు ఏడాదికి అక్షరాలా రూ.16 లక్షల నికర ఆదాయం ఆర్జిస్తున్నారు. వరితో పాటు అల్లం, వసకొమ్ము సాగు చేస్తూనే.. మరోవైపు పాడి పరిశ్రమ, చేపల పెంపుడు, గొర్రెల పెంపును సమన్వయం చేసుకుంటూ లాభాలు గడిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించవచ్చని నిరూపించిన ఈ రైతు ప్రతిభను గుర్తించి రాజేంద్రనగర్ యూనివర్సిటీ సహా పలు వేదికలపై ఉత్తమ రైతు (బెస్ట్ ఫార్మర్) అవార్డులు అందజేశారు.

వరి సాగులో నీటి వినియోగాన్ని 30 శాతం వరకు తగ్గించేందుకు తాను 'ఆల్టర్నేటింగ్ వెడ్డింగ్ అండ్ డ్రైయింగ్' (AWD) విధానాన్ని అనుసరిస్తున్నట్లు రైతు వివరించారు. పొలంలో 6 అంగుళాలీ PVC పైపును ఏర్పాటు చేసి, దాని ద్వారా భూమిలో తేమ శాతాన్ని, నీటి మట్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేస్తూ తడులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పద్ధతి ద్వారా భూమికి, వేర్లకు ఆక్సిజన్ బాగా అందడంతో పాటు వానపాములు వృద్ధి చెంది పంట దిగుబడి పెరుగుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తోటి రైతులకు కూడా ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story