PM Kisan: రైతులకు అలర్ట్..! ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోతాయి..!

PM Kisan: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

G Krishna
Published on: 16 May 2026 10:53 AM IST
PM-Kisan
X

PM-Kisan

PM Kisan: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన' (PM-Kisan). ఈ పథకం ద్వారా అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయ రంగంలో వారిని ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. ఈ పెట్టుబడి సాయాన్ని ఒకేసారి కాకుండా, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే డిపాజిట్ (డీబీటీ) చేస్తోంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు పూర్తి నగదు అందుతోంది.

23వ విడత కోసం రైతుల ఆసక్తికర నిరీక్షణ

పీఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులు ఇప్పటివరకు విజయవంతంగా 22 విడతల డబ్బులను తమ ఖాతాల్లో పొంది ఉన్నారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న 22వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 13న అస్సాంలోని గౌహతి వేదికగా బటన్ నొక్కి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లలో జమ చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండడంతో, పొలం పనుల పెట్టుబడుల కోసం దేశంలోని రైతాంగం అంతా 23వ విడత నిధుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మార్చి నెలలో 22వ విడత అందిన నేపథ్యంలో, నిబంధనల ప్రకారం తదుపరి వాయిదా నాలుగు నెలల వ్యవధి తర్వాత రావాల్సి ఉంటుంది. దీనిని బట్టి పీఎం కిసాన్ యోజన 23వ విడత నిధులు 2026 జూన్ , జూలై నెలల మధ్య కాలంలో రైతుల ఖాతాల్లో జమ కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ విడత విడుదల తేదీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇ-కేవైసి (e-KYC) ఎందుకు తప్పనిసరి?

ఈ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, నిజమైన లబ్ధిదారులకే ఈ సాయం అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇ-కేవైసిని విధిగా పూర్తి చేయాలని ఆదేశించింది. పీఎం కిసాన్ యోజన కింద నమోదు చేసుకున్న ప్రతి రైతు ఈ ప్రక్రియను ముగించడం ఎంతో ముఖ్యం. ఒకవేళ మీ ఇ-కేవైసి ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నా, మీ ధృవీకరణ (Verification) పెండింగ్‌లో ఉన్నట్లు చూపిస్తున్నా, మీ తదుపరి వాయిదా సొమ్ము ఆగిపోయే ప్రమాదం ఉంది. మీ ఖాతాలో ₹2,000 ఆలస్యం కాకుండా సకాలంలో పడాలంటే, వెంటనే ఈ కింద తెలిపిన పద్ధతి ద్వారా ఇ-కేవైసిని పూర్తి చేసుకోవడం మంచిది.

ఇంటి నుండే సులభంగా ఇ-కేవైసి చేసుకునే విధానం

రైతులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ ప్రక్రియను సులువుగా పూర్తి చేయవచ్చు. మొదటగా, పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ అయిన pmkisan.gov.in ను ఓపెన్ చేయాలి. హోమ్ పేజీ స్క్రీన్‌పై కనిపించే ‘ఫార్మర్స్ కార్నర్’ (Farmers Corner) విభాగానికి వెళ్లాలి. ఆ విభాగంలో ఉన్న ‘ఇ-కెవైసి’ (e-KYC) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అయిన తర్వాత, అక్కడ మీ గుర్తింపు నంబర్ (ID Number) , మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. వివరాలు నమోదు చేశాక, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని నిర్దేశిత బాక్సులో టైప్ చేసి, కింద ఉన్న ‘సమర్పించు’ (Submit) బటన్‌పై క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ విజయవంతంగా ముగిసిన వెంటనే, మీ కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌పై ‘ఇ-కెవైసి విజయవంతమైంది’ (successful e-KYC) అనే మెసేజ్ కనిపిస్తుంది. ఈ చిన్న పనిని ముందుగానే పూర్తి చేసుకోవడం వల్ల 23వ విడత డబ్బులు ఎలాంటి అంతరాయం లేకుండా నేరుగా మీ అకౌంట్‌కు చేరుకుంటాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story