El Nino Impact: ఎల్‌నినో వేళ నీటి కష్టాలకు చెక్.. భూగర్భజలాలను పెంచుకుంటున్న అచ్చంపేట రైతులు

El Nino Impact: ఎల్‌నినో వేళ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు పామ్‌ పాండ్లు, బోర్వెల్ రీచార్జ్ ద్వారా భూగర్భ జలాలను ఎలా పెంచుకుంటున్నారో తెలుసుకోండి.

Arun Chilukuri
Published on: 15 Sept 2026 3:00 PM IST
El Nino Impact
X

El Nino Impact: ఎల్‌నినో వేళ నీటి కష్టాలకు చెక్.. భూగర్భజలాలను పెంచుకుంటున్న అచ్చంపేట రైతులు

El Nino Impact: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గిపోయి చెరువులు, బోర్లు అడుగంటిపోతున్న తరుణంలో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు.

డబ్ల్యూఎల్‌ఎఫ్‌ (WLF) ఎన్జీవో సంస్థ సహకారంతో రైతులు తమ పొలాల్లో ప్రత్యేకంగా నీటి గుంటలు (ఫామ్‌ పాండ్లు) మరియు బోర్వెల్ రీచార్జ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకుంటున్నారు.

వర్షం పడినప్పుడు వృథాగా పోయే ప్రతీ బొట్టు నీటిని ఈ గుంటల్లో సేకరించి, భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలమట్టాన్ని గణనీయంగా పెంచుకోవచ్చని నిపుణులు, రైతులు చెబుతున్నారు.

ఈ నీటి గుంటల వల్ల బోర్లు సమృద్ధిగా రీచార్జ్ అవుతాయని, ఎక్కువ సేపు మోటార్లు నడుపుతూ పంటలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. అంతేకాకుండా, ఈ కుంటల్లో చేపలు పెంచుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని కూడా పొందుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు ఆర్థిక భారం కాకుండా, స్వల్ప మొత్తమే (సుమారు రూ. 6,000) రైతు వాటాగా తీసుకొని మిగతా పెద్ద మొత్తాన్ని ఎన్జీవో సంస్థే భరించి ఈ ఊట కుంటలను నిర్మిస్తోందని రైతులు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.