Dairy Farming Success Story: పంట నష్టాల నుంచి పాడి లాభాల వైపు.. ముల్కనూర్ రైతు సదానందం సక్సెస్ స్టోరీ!

Dairy Farming Success Story: పత్తి, మిర్చి పంటల్లో నష్టాలు వచ్చి ఆత్మహత్యల వైపు ఆలోచించకుండా, పాడి పరిశ్రమ వైపు అడుగులేసి నెలకు వేలల్లో సంపాదిస్తున్న వరంగల్ జిల్లా ముల్కనూర్ రైతు సదానందం సక్సెస్ స్టోరీ.

Arun Chilukuri
Published on: 5 Aug 2026 1:06 PM IST
Dairy Farming Success Story
X

Dairy Farming Success Story: పంట నష్టాల నుంచి పాడి లాభాల వైపు.. ముల్కనూర్ రైతు సదానందం సక్సెస్ స్టోరీ!

Dairy Farming Success Story: సాంప్రదాయ పంటలు వేసి నష్టపోయామని ధైర్యం కోల్పోకుండా, ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమను ఎంచుకుని లాభాల బాటలో పయనిస్తున్నారు వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన యువ రైతు సదానందం. ఒకప్పుడు పత్తి, మిర్చి పంటలు వేసి తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూసిన ఆయన, డాక్టర్ మొండయ్య గారి సూచనతో పాడి వైపు అడుగులు వేశారు.

ఒకానొక దశలో పంట నష్టాలతో కుంగిపోయినా, తోటి రైతుల్లా ఆత్మహత్య ఆలోచన చేయకుండా ధైర్యంతో పాడి పరిశ్రమను ప్రారంభించారు. కేవలం ఒక ఆవుతో మొదలైన ఆయన డైరీ ఫామ్, ఇప్పుడు 10 ఆవులు, 3 గేదెలు (మొత్తంగా 15 జీవాలు) కలిగి ఉంది.

ఆవులను సొంత పిల్లల్లా కంటికి రెప్పలా చూసుకుంటారు. రోజుకు రెండుసార్లు కడిగి శుభ్రపరచడం, 15 రోజులకు ఒకసారి పశువైద్యుడితో హెల్త్ చెకప్ చేయిస్తారు. దానా విషయంలో పత్తి చెక్క, పెసర పొట్టు, తవుడు, మక్క పిండి, మినరల్ మిశ్రమం మరియు క్యాల్షియం అందిస్తారు.

రోజుకు 50 నుంచి 60 లీటర్ల పాలను ముల్కనూర్ డైరీకి విక్రయిస్తున్నారు. దీనిద్వారా నెలకు ₹50,000 నుండి ₹60,000 వరకు రాబడి వస్తుండగా, దానా మరియు ఇతర నిర్వహణ ఖర్చులు ₹20,000 నుండి ₹25,000 పోనూ, నెలకు నికరంగా ₹35,000 నుండి ₹40,000 వరకు నికర లాభం పొందుతున్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో పాటు గడ్డి కోసే యంత్రాలు, పాలు పితికే యంత్రాలను వినియోగిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పంటలు నష్టపోయినప్పుడు అధైర్యపడకుండా ప్రతి రైతు పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలను ఎంచుకోవాలని ఆయన పిలుపునిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story