Terrace Garden: వృధా కూల్ డ్రింక్ బాటిల్స్‌తో ఇంటి వద్దే ఆకుకూరల సాగు.. మిద్దె తోటలో గృహిణి వినూత్న ప్రయోగం!
Terrace Garden: ప్లాస్టిక్ లేదా కూల్ డ్రింక్ బాటిల్స్‌ను పడేయకుండా వాటిలో ఇంట్లోనే ఆకుకూరలు (మెంతికూర, పాలకూర), పూల మొక్కలు ఎలా పెంచుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకోండి.
Terrace Garden: వృధా కూల్ డ్రింక్ బాటిల్స్‌తో ఇంటి వద్దే ఆకుకూరల సాగు.. మిద్దె తోటలో గృహిణి వినూత్న ప్రయోగం!
Terrace Garden: పారేసే ప్లాస్టిక్ బాటిళ్లతో పర్యావరణానికి హాని కలగకుండా, దాన్నే ఒక అవకాశంగా మార్చుకుంటూ ఇంటి వద్దే ఆరోగ్యకరమైన ఆకుకూరలను సాగు చేస్తున్నారు ఒక గృహిణి. ఇంట్లో వాడి పడేసిన కూల్ డ్రింక్ బాటిల్స్‌ను ఉపయోగించి మిద్దె తోటలో (Terrace Garden) రకరకాల ఆకుకూరలు, పూల మొక్కలు పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
వారంలోనే ఫ్రెష్ ఆకుకూరలు:
కూల్ డ్రింక్ బాటిల్స్‌ను పక్కల వైపు కట్ చేసి, చిన్న రంధ్రాలు చేసి మట్టి నింపి వేలాడదీసే విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా మెంతికూర కేవలం 7 రోజుల్లోనే పూర్తి స్థాయిలో పెరుగుతుందని, ఇది ఆరోగష్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆమె వెల్లడించారు. తక్కువ స్థలం ఉండే అపార్ట్‌మెంట్లలో నివసించే వారు, అద్దె ఇళ్లలో ఉన్నవారు కూడా ఈ పద్ధతిలో చాలా తేలికగా ఆకుకూరలను పండించుకోవచ్చని తెలిపారు.
రీసైక్లింగ్ ద్వారా పర్యావరణ పరిరక్షణ:
బాటిల్స్‌లో ఆకుకూరలతో పాటు టమాటా, వాము ఆకు, బంతి, లిల్లీ పూల మొక్కలను కూడా పెంచుతున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేస్తూ మొక్కలు పెంచడం వల్ల ఇల్లు శోభాయమానంగా మారడమే కాకుండా, పర్యావరణానికి మేలు చేసినట్లవుతుందని పేర్కొన్నారు. ఇంట్లో ఉండే పిల్లలకు కూడా మొక్కల పెంపకంపై అవగాహన కల్పించడానికి ఇదొక మంచి మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు.




