Health: స్మోకింగ్ చేస్తే మెదడు చిన్నగా అవుతుందా.? అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Health: ఈరోజుల్లో యువతలో సిగరెట్, గంజా (వీడ్) వంటి మత్తు పదార్థాల వినియోగం వేగంగా పెరుగుతోంది.
Health
Health: ఈరోజుల్లో యువతలో సిగరెట్, గంజా (వీడ్) వంటి మత్తు పదార్థాల వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా చోట్ల ఇది ఒక రకంగా “కల్చర్”గా కూడా కనిపిస్తోంది. అయితే ఈ అలవాట్లు మెదడు ఆరోగ్యం, శరీర ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై ఇటీవల జరిగిన ఒక పరిశోధన ఆందోళనకర విషయాలు బయటపడ్డాయి.
అడిక్షన్ అనే శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పొగ త్రాగడం వల్ల మెదడులో కొన్ని భాగాలు కుదించే ప్రమాదం ఉందని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా గంజా వినియోగం వేగంగా పెరుగుతోంది. 2022 గణాంకాల ప్రకారం ప్రపంచంలో సుమారు 23 కోట్ల మంది గంజా ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచ జనాభాలో సుమారు 4.4 శాతం కావడం గమనార్హం. కొన్ని దేశాల్లో గంజా చట్టబద్ధం కావడం, సోషల్ మీడియాలో దాని గురించి సానుకూలంగా ప్రచారం కావడం వల్ల యువతలో దీనిపై ఆసక్తి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
తంబాకూ వినియోగం మరింత ప్రమాదకరం
గంజా కంటే కూడా తంబాకూ వినియోగం చాలా ఎక్కువగా ఉంటోంది. 2020 నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం మంది తంబాకూ ఉపయోగిస్తున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 80 లక్షల మంది మరణాలకు ఇది కారణమవుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా దీనికి బానిసవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. దీని వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి.
కొత్త పరిశోధనలో బయటపడిన విషయాలు
ఈ అధ్యయనంలో క్రాస్ సెక్షన్, లాంగిట్యూడినల్, మెనెడిలియన్ రాండమైజేషన్ (MR) వంటి పద్ధతులను ఉపయోగించి గంజా, సిగరెట్ వినియోగం మెదడుపై చూపే ప్రభావాన్ని పరిశీలించారు. ఈ పరిశోధనలో తేలిన విషయాల ప్రకారం.. కొంతమంది గంజా వినియోగదారుల్లో అమిగ్డాలా అనే మెదడు భాగం పరిమాణం తగ్గినట్లు కనిపించింది. అయితే ఇది ప్రతి వయస్సులో కనిపించలేదు. తంబాకూ వినియోగదారుల్లో మెదడులోని గ్రే మ్యాటర్ సహా కొన్ని భాగాలు చిన్నవిగా కనిపించాయి. తంబాకూ వల్ల మెదడులో ఇన్‌ఫ్లమేషన్ (వాపు) పెరిగే అవకాశం ఉందని సూచనలు ఉన్నాయి. గంజాలో ఉండే CBD అనే పదార్థం కొంత రక్షణ కలిగించవచ్చు అని కొంత పరిశోధన చెబుతోంది. గంజా, తంబాకూ రెండింటినీ కలిపి ఉపయోగించడం గురించి ఇంకా సరైన పరిశోధన లేదు.
పరిశోధన తేల్చిన ముఖ్య విషయం
ఈ అధ్యయనం ప్రకారం తంబాకూ వినియోగం మెదడులో మెమరీ, భావోద్వేగాలను నియంత్రించే భాగాల పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉందని కనిపించింది. గంజా విషయంలో ఆధారాలు పూర్తిగా స్పష్టంగా లేనప్పటికీ, దీని ప్రభావం గురించి ఇంకా ఎక్కువ పరిశోధన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి, సిగరెట్, గంజా వంటి అలవాట్లు దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందుకే యువతలో ఈ అలవాట్లపై అవగాహన పెంచడం చాలా అవసరం.


