Bapatla: వైసీపీ నుంచి సీనియర్ నాయకుడు మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్!
Bapatla: బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి శ్రీనివాసరావు పార్టీ నుంచి సస్పెండ్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే కారణం.
Bapatla: వైసీపీ నుంచి సీనియర్ నాయకుడు మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్!
Bapatla: రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి శ్రీనివాసరావు ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
పార్టీ క్రమశిక్షణా కమిటీ ఆదేశాలు మరియు సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మోపిదేవి శ్రీనివాసరావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో, విచారణ చేపట్టిన క్రమశిక్షణా కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేస్తున్నట్లు YCP స్పష్టం చేసింది.




