Bapatla: నందిగుంటపాలెంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు!
Bapatla: బాపట్ల జిల్లా కారంచేడు మండలం నందిగుంటపాలెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో టీడీపీలో చేరారు.
Bapatla: నందిగుంటపాలెంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు!
బాపట్ల: కారంచేడు మండలం నందిగుంటపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ, గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
టీడీపీలో చేరిన వారిలో మాజీ ఉప సర్పంచ్ జజ్జర మహేష్, దక్కుమళ్ల ఇస్మాయిల్, కందుల యోహాను, బి. అవినాష్, జె. అనిల్, వై. సుధీర్, వి. సుధాకర్, ఎన్. రాంబాబు, కె. మహేశ్వర్‌రావు, ఎన్. భాగ్యరాజు, ఎన్. పవన్‌కుమార్, వి. రాజు, యారం సుబ్బయ్య తదితరులు ఉన్నారు.
పట్టిసీమతో ఆరుతడి పంటలకు భరోసా ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషి చేస్తున్నారని తెలిపారు. తాము కౌలు రైతులుగా ఉన్నామని, ఎన్ఎస్పీ కాలువకు తమ భూములు చివరి ప్రాంతంలో ఉన్నాయని చెప్పారు. కొమ్మమూరు కాలువ ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు నీరు తమకు కొండంత అండగా నిలుస్తోందన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంటలకు చుక్కనీరు లేక ఇబ్బందులు ఎదురైన సమయంలో తమ ప్రాంతంలో ఆరుతడి పంటలకు పట్టిసీమ నీరు వరంగా మారిందన్నారు. సాగునీటి సౌకర్యంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే ఏలూరి విశేష కృషి చేస్తున్నారని, జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నక్కల రాఘవ, టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ ఖాసిం సాహెబ్, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమలశెట్టి శ్రీహరి, ఆదినారాయణ, టీడీపీ సీనియర్ నేత అమర్నేని సుబ్బారావు, నూకతోటి ఆదెయ్య, నూకతోటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.




