Gurazala: తిరుమల టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు: కాసు మహేష్ రెడ్డి

Gurazala: గురజాల నియోజకవర్గంలో వినూత్న నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.

SK SAIDA, GURAJALA
Published on: 31 July 2026 5:45 PM IST
Gurazala
X

Gurazala: తిరుమల టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు: కాసు మహేష్ రెడ్డి

గురజాల: గురజాల నియోజకవర్గంలో తిరుమల టికెట్లు సైతం అమ్ముకుంటున్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇకనైనా మంచి బుద్ధి ప్రసాదించాలని నగర పంచాయతీ పరిధిలోని జంగమహేశ్వరపురం నందు ఉన్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కొబ్బరి టెంకాయ కొట్టి నిరసనతెలియజేసిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడుతూ నీతిగా బతకాల్సిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధర్మాన్ని పాటిస్తూ, అవినీతి చేసుకుంటూ పోతుంటే ప్రజల పతిస్థితి ఏంటి అంటూ మాజీ ఎమ్మెల్యే కాసు ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తూ సంక్షేమం అందిస్తాం అని ప్రజలతో ఓట్లెపించుకున్న తెదేపా నేతలు గుడి, గుడిలో లింగాన్ని మింగుతున్నారు అని మండిపడ్డారు.

నియోజకవర్గంలో అవినీతి తారా స్థాయికి చేరింది అని లిక్కర్, గంజాయి, మైనింగ్, పేకాట క్లబ్ లు, చివరికి తిరుపతి దర్శనం టిక్కెట్లు కూడా అమ్ముకుంటున్నారు అంటే ఇంతకంటే అవినీతి బహుశా ఎప్పుడూ చూడలేమేమో అని కాసు ఎద్దేవా చేశారు. ఇటువంటి నాయకులను మార్చాలంటే ఆ దేవుడి వల్లే అవుతుంది అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మంచి బుద్ధి ప్రసాదించాలి అని కోరినట్లు కాసు అన్నారు.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA

Next Story