Guntur: కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు దుర్మార్గం వైఎస్సార్సీపీ నేతలు!

Guntur: బీసీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ నేతలు మండిపడ్డారు. బీసీ నేతలను చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోందన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 26 Aug 2026 5:36 PM IST
Guntur
X

Guntur: కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు దుర్మార్గం వైఎస్సార్సీపీ నేతలు!

Guntur: బీసీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు దుర్మార్గమని జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు తాడిబోయిన వేణు గారు, జిల్లా పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు సిరిబోయిన అవినాష్ గారు పేర్కొన్నారు.

బీసీ నేతలే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు బీసీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ కొండా రవి, పశ్చిమ బీసీ సెల్ అధ్యక్షుడు అరవింద్ ఓలేటి గారు, పశ్చిమ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఆర్నాల్డ్, దాసరి శ్రీకాంత్ యాదవ్, పూర్ణచంద్రరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story