Palnadu: యడ్లపాడులో భారీ చోరీ రూ.75 లక్షల విలువైన సొత్తు మాయం!

Palnadu: పల్నాడు జిల్లా యడ్లపాడులో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో చొరబడి రూ.75 లక్షల విలువైన బంగారం, వెండి, నగదును దుండగులు అపహరించారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 10 Sept 2026 5:27 PM IST
Palnadu
X

Palnadu: యడ్లపాడులో భారీ చోరీ రూ.75 లక్షల విలువైన సొత్తు మాయం!

Palnadu: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట యడ్లపాడులో భారీ చోరీ.. రూ.75 లక్షల సొత్తు మాయం. హైదరాబాద్ వెళ్లిన పార్వతి ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన కేటుగాళ్లు.

46 సవర్ల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ.50 వేల నగదు అపహరణ, మొత్తం సుమారు రూ.75 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైనట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరగడంతో స్థానికంగా కలకలం.

సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న యడ్లపాడు పోలీసులు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్సీ, సీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు, కెమెరాల్లో నిందితుల కదలికలు రికార్డైనట్లు గుర్తింపు.

నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు. భారీ మొత్తంలో సొత్తు చోరీ కావడంతో యడ్లపాడులో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA

Next Story