Guntur: పెళ్లికి అడ్డొస్తోందని దారుణ హత్య.. గుంటూరులో ముగ్గురి అరెస్ట్!

Guntur: పెద్దకాకాని పరిధిలో మహిళ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లికి అడ్డుపడుతోందని గొంతుకోసి చంపిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 10 Sept 2026 8:59 PM IST
Guntur
X

Guntur: పెళ్లికి అడ్డొస్తోందని దారుణ హత్య.. గుంటూరులో ముగ్గురి అరెస్ట్!

గుంటూరు: సెప్టెంబర్ 7వ తేదీ నాడు వేనుగండ్ల గ్రామంలో మహిళ హత్యకు గురైనట్లుగా సమాచారం అందింది. సమాచారం అందుకున్న పెద్దకాకాని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలు కోటేశ్వరమ్మ 47 గా గుర్తించారు.

మృతురాలు కుమారుడు సాదిక్ కి నిందితురాలు మరియా కుమారి కూతురుకి వివాహం చేయాలని భావించింది. సాదిక్ తల్లి వివాహానికి అడ్డుపడుతుందన్న అనుమానంతో యద్దనపూడి మరియాకుమారి,బత్తుల మహేష్,అన్నంగి శ్రీకాంత్, కలసి కోటేశ్వరమ్మను హతమార్చారు.

హత్య అనంతరం 1లక్ష నగదును, జత బంగారు గాజులు, నాలుగు బంగారు ఉంగరాలు, ఒక జత బంగారు చెవి పోగులు, ఒక బంగారు నల్లపూసల దండ, నిందితులు చోరీ చేశారు.

ఈ హత్య పక్కా ప్లాన్ ప్రకారం కోటేశ్వరమ్మను అడ్డు తొలగించుకోవాలని ఆమె గొంత కోసి ముగ్గురు నిందితులు హత్య చేశారు. నిందితుల ముగ్గురు పల్నాడు జిల్లా వాసులు..

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story