Vinukonda: ఎలక్ట్రిక్ స్కూటీపై వచ్చి.. స్వయంగా చీపురు పట్టిన చీఫ్ విప్
Vinukonda: వినుకొండలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.
Vinukonda: ఎలక్ట్రిక్ స్కూటీపై వచ్చి.. స్వయంగా చీపురు పట్టిన చీఫ్ విప్
Vinukonda: వినుకొండ పట్టణంలోని లాయర్ స్ట్రీట్‌లో నిర్వహించిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా, ఆయన కార్యాలయం నుండి ఎలక్ట్రిక్ స్కూటీపై స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ కార్యక్రమ ప్రాంతానికి చేరుకోవడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం జీవీ స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేస్తూ పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజలు కూడా చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి హరితాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని సూచించారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, శుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.




