Vinukonda: చాటగడ్డపాడులో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Vinukonda: వినుకొండ మండలం చాటగడ్డపాడులో భార్యాభర్తల గొడవ. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న భర్త కోటేశ్వరరావు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు.
Vinukonda: చాటగడ్డపాడులో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వినుకొండ: వినుకొండ మండలంలోని చాటగడ్డపాడు గ్రామంలో వ్యక్తిగత కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.మార్కాపురం జిల్లా దొర్నాలకు చెందిన కోటేశ్వరరావుకు, చాటగడ్డ పాడు గ్రామానికి చెందిన కోటమ్మతో 2016లో వివాహం జరిగింది.
వీరికి ముగ్గురు పిల్లలు.కోటేశ్వరరావు మద్యం బానిసగా మారి, తరచూ భార్య ప్రవర్తనపై అనుమానం పెట్టుకుని గొడవపడేవాడు. ఇదే విషయమై మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన కోటేశ్వరరావు తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
ఈ ప్రమాదంలో అతని రెండు చేతులు మరియు వీపు భాగంలో దాదాపు 40% కాలిన గాయాలయ్యాయి.గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.




