Vinukonda: మెగా పిటిఎంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, కలెక్టర్
Vinukonda: ఈపూరు కేజీబీవీలో రూ.1.59 కోట్లతో నిర్మించిన డార్మిటరీ భవనాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు.
Vinukonda: మెగా పిటిఎంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, కలెక్టర్
Vinukonda: వినుకొండ నియోజకవర్గం ఈపూరు లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (KGBV)లో రూ.1.59 కోట్లతో నూతనంగా నిర్మించిన డార్మిటరీ భవనాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొని విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు, షూస్ పంపిణీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, మౌలిక వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ వారి చదువులు, విద్యా ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే కీలకమని, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని వారు తెలిపారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.




