Vinukonda: వినుకొండలో కేజీబీవీ నూతన భవనం ప్రారంభం జీవీ ఆంజనేయులు
Vinukonda: వినుకొండలో రూ.1.50 కోట్లతో నిర్మించిన కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.
Vinukonda: వినుకొండలో కేజీబీవీ నూతన భవనం ప్రారంభం జీవీ ఆంజనేయులు
వినుకొండ: వినుకొండలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) నూతన భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం బాలికలకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేలా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రారంభోత్సవం అనంతరం జీవీ ఆంజనేయులు నూతన భవనంలోని తరగతి గదులు, వసతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఆయన, వారి చదువు, వసతి, భోజనం, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు .బాలికా విద్యకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని,నాణ్యమైన విద్యతోనే రాష్ట్ర భవిష్యత్తు మరింత బలోపేతం అవుతుందని, ప్రతి విద్యార్థిని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
గ్రామీణ ప్రాంతాల బాలికలకు కూడా పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విద్యా సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ నూతన భవనం ద్వారా విద్యార్థినులు మరింత మెరుగైన వాతావరణంలో విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.




