Vinukonda: వినుకొండలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు 'ప్రజాదర్బార్'

Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో 'ప్రజాదర్బార్' కార్యక్రమం ఘనంగా జరిగింది.

KAREEMULLA, VINUKONDA
Published on: 29 May 2026 4:53 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు 'ప్రజాదర్బార్'

Vinukonda: వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన జీవీ,ప్రతి సమస్యను శ్రద్ధగా విని, సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, తాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని జీవీ. ఆంజనేయులు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ప్రజాదర్బార్ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story