Guntur: ప్రముఖ గాయని ఎస్పీ శైలజకు గౌరవ డాక్టరేట్!
Guntur: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Guntur: ప్రముఖ గాయని ఎస్పీ శైలజకు గౌరవ డాక్టరేట్!
గుంటూరు: డిగ్రీలు కాదు నైపుణ్యాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయని విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యను అభ్యసించాలని విజ్ఞాన్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవ వేడుకలలో అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి అన్నారు.
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో 14 వ స్నాతకోత్సవ రెండవ రోజు వేడుకలలో ముఖ్య అతిథులుగా ఏపీ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ కే మధుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రముఖ సినీ గాయని ఎస్పీ శైలజ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు, ఈ సందర్భంగా ఎస్పీ శైలజ మాట్లాడుతూ విద్యార్థులు కృషి పట్టుదలతో విద్యను అభ్యసిస్తే అసాధ్యం అంటూ ఏదీ ఉండదని అన్నారు, క్రమశిక్షణ, ఉన్నత విలువల పట్ల నిబద్ధత ఉంటే దీర్ఘకాలిక విజయాలు లభిస్తాయి అన్నారు.
విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ధైర్యంగా స్వీకరించాలన్నారు.
విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు నిరంతరం తమను తాము మార్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ప్రతి రంగాన్ని వేగంగా మార్చుతోందన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న అంతర్జాతీయ విశ్వాసం ఆవిష్కరణ పట్ల ప్రపంచ స్థాయిలో గుర్తింపు యువతకు గొప్ప అవకాశాలను అందిస్తాయన్నారు.




