Vemuru: పోతుమర్రులో పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు!

Vemuru: బాపట్ల జిల్లా పోతుమర్రులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. చంద్రబాబుకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని వెల్లడి.

KIRAN BABU,	VEMURU
Published on: 1 Sept 2026 1:18 PM IST
Vemuru
X

Vemuru: పోతుమర్రులో పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు!

Vemuru: వేమూరు మండలం పోతుమర్రు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు భారీ ట్రాక్టర్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలాంటివని అన్నారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వ తప్పిదాల వల్లే రైతులకు సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని విమర్శించారు. పోలవరం పూర్తయి ఉంటే రైతులకు సజావుగా నీరు అందేదని అన్నారు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా రైతులకు కొంతమేర సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు తల్లికి వందనం, డ్వాక్రా గ్రూపులు, ఉచిత బస్సు వంటి పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.

KIRAN BABU,	VEMURU

KIRAN BABU, VEMURU

Next Story