Guntur: ప్రజా నివాసాల సమీపంలో బ్లాస్టింగ్ ఆపేయాలి: డైమండ్ బాబు!
Guntur: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడులో క్వారీ బ్లాస్టింగ్ నిలిపివేయాలని వైసీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) డిమాండ్ చేశారు.
Guntur: ప్రజా నివాసాల సమీపంలో బ్లాస్టింగ్ ఆపేయాలి: డైమండ్ బాబు!
Guntur: తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలం, వేములూరిపాడు గ్రామంలో క్వారీ మైనింగ్ బ్లాస్టింగ్ వలన స్తానిక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారని వైసీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) తెలిపారు.
స్తానిక బాధితుల విజ్ఞప్తి మేరకు మంగళవారం గ్రామాన్ని డైమండ్ బాబు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ తాము ఇంట్లో ఉన్న సమయంలో పెద్ద పెద్ద రాళ్ళు ఇంటిపైపడి ఇల్లు రేకులు విరిగిపోతున్నాయని, కొన్ని కొన్ని సార్లు రాళ్ళు మునుషుల మీదపడి ప్రయాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయన్నారు.
కొత్తగా నిర్మించుకున్న ఇల్లు కూడా క్రాక్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డైమండ్ బాబు మాట్లాడుతూ ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ కార్యాలయం కి వెళ్లి సంబంధిత అధికారిని కలిస్తే ఆయన చులకన భావంతో మార్కడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. ఇకపై బ్లాస్టింగ్ జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. తక్షణమే స్థానిక గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులతో పాటు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




