Vatticherukuru: 22-ఏ భూ సమస్యలకు పరిష్కారం - ధ్రువీకరణ పత్రాలు అందజేత
Vatticherukuru: వట్టిచెరుకూరులో 22-ఏ భూ సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అందజేశారు.
Vatticherukuru: 22-ఏ భూ సమస్యలకు పరిష్కారం - ధ్రువీకరణ పత్రాలు అందజేత
వట్టిచెరుకూరు: గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో భాగంగా 22-A భూ సమస్యలను పరిష్కరించి ధ్రువీకరణ పత్రాలను అందజేసే కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని, స్థానిక బి. రామాంజనేయులు గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ గారితో కలిసి చేస్తూ లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు.
వట్టిచెరుకూరు గ్రామ ముఖద్వారం నుంచి కేంద్ర మంత్రి పెమ్మసాని గారిని, రెవెన్యూ శాఖ మంత్రి ప్రసాద్ గారిని, ఎమ్మెల్యే రామాంజనేయులు గారిని, భాష్యం రామకృష్ణ గారిని సభా ప్రాంగణం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర గ్రామస్తులు భారీ ర్యాలీగా తీసుకువెళ్లారు.
పెమ్మసాని గారి కామెంట్స్
* ప్రభుత్వం వచ్చాక 22-ఏ భూ సమస్యలను ఒక ప్రజా సమస్యగా తీసుకొని పరిష్కరిస్తుంది.
* ఎప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేశారు.
* రాష్ట్రవ్యాప్తంగా ఈ 22 - ఏ సమస్యలు ఉన్నప్పటికీ ముందుగా గుంటూరులో ఎందుకు పరిష్కరించబడ్డాయి అంటే ఆయా నాయకుల కృషి, చొరవ మాత్రమే కారణమని ప్రతి ఒక్కరు గుర్తించాలి.
* సుమారు 120 ఏళ్ల క్రితం ఏర్పడ్డ 22-A సమస్య వల్ల దశాబ్దాలుగా రికార్డుల తారుమారు, రీసర్వే లో సమగ్రంగా జరగకపోవడం వంటి సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ వచ్చారు.
* అప్పట్లో జగన్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులపై పెత్తనం ఉండే విధంగా వైసిపి ప్రభుత్వం ప్రయత్నించింది.
* ఎవరైనా భూములను అమ్ముకోదలిచిన లేదా అభివృద్ధి పరచుకోదలిచినా 8% ఛార్జ్ చెల్లిస్తే సరిపోతుంది.
* వీలునామా లేకుండా జరిగే ఇన్హెరిటెన్స్ కేసుల్లో స్టాంప్ డ్యూటీని కూటమి ప్రభుత్వం చాలా వరకు తగ్గించింది. రూ. 10 లక్షల వరకు ఉన్న ఆస్తులకు కేవలం వంద రూపాయలతో అలాగే పది లక్షల రూపాయలు ఉండే ఆస్తులకు వెయ్యి రూపాయలు నిర్ణయించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది.
* అలాగే ఇళ్ల పట్టాలు లేని నిరుపేదలకు మంగళగిరి నియోజకవర్గ కేంద్రంగా శ్రీ నారా లోకేష్ గారి చేతులమీదుగా ఆయా ప్రజలకు పట్టాలు అందజేయడం కూడా జరిగింది.
* గతంలో ఎన్నడూ లేని విధంగా నా పరిధిలోకి వచ్చే గ్రామీణ అభివృద్ధిలో ఉండే చెరువులను అభివృద్ధి పరచడమే కాకుండా ఎన్నో మౌలిక వసతులను కూడా అభివృద్ధి పరుస్తున్నాము.
* రూ. 100 కోట్ల నిధులతో ఆయుర్వేద హాస్పిటల్ లో అందుబాటులోకి ఈ నియోజకవర్గంలో తీసుకురాబోతున్నాము.
* త్వరలోనే ఆసుపత్రికి శంకుస్థాపన కూడా చేయబోతున్నాము.
* మన ప్రాంతంలో ప్రత్తి కొనుగోళ్ళు ఇబ్బందులు కలిగిన రోజున అధికారులతో చర్చించు మరి రైతులకు న్యాయం చేసిన ఘనత మనది.
* ప్రతి ఏటా లక్ష బస్తాలు యూరియా మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్నప్పటికీ, గత సంవత్సరం 1,40,000 బస్తాలు వచ్చినా, రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డారు.
* ఆ సమస్యను పరిష్కరించే విధంగా సాంకేతిక విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నాము.
* ఎదిగింది అమెరికాలో అయినా పుట్టింది, పెరిగింది ఇక్కడే కాబట్టి ప్రతి రైతు సమస్య నాకు తెలుసు. ప్రతి రైతు సమస్యను పరిష్కరిస్తాం ప్రతి రైతు కన్నీళ్లను తుడుస్తాం.
అనగాని సత్యప్రసాద్ గారి కామెంట్స్
* నీతి, నిజాయితీకి నిలువెత్తు రూపం అయినా స్వయాన ప్రధానమంత్రి నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చినటువంటి ఎంపీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి వంటి నాయకులు ప్రతి పార్లమెంటులో ఉండాలి.
* వట్టిచెరుకూరు గ్రామానికి ఎంతో అరుదైన చరిత్ర ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన భూ సమస్య పరిష్కారం ఏదైతే ఉందో అది మరో గొప్ప చరిత్రగా తీర్చిదిద్దుకుంది.
* ఇది కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగా, ప్రభుత్వం యొక్క పనితీరుకు తార్కాణంగా ఇవాళ జరిగే ధ్రువీకరణ పత్రాల పంపిణీ నిలుస్తుంది.
* ఈరోజు కొందరు వ్యక్తులు ఉన్నటువంటి ఈ పరిష్కారాలను చూసి తమ భూములు కూడా 22-ఏ కారణంగా ఇబ్బందుల్లో ఉన్నాయని, తమకు కూడా పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. సమర్థవంతులైన నాయకులు ఉన్నారని తెలిసి ఒక్కొక్కరుగా తమ సమస్యలను బయటకు తీసుకు వస్తుండటం విశేషం.
* ఈరోజు ప్రజలకు ఉన్న సమస్యలలో 70% రెవెన్యూకు సంబంధించినవి ఉన్నాయి. వచ్చిన తర్వాత వాటిల్లో మాక్సిమం సమస్యలను పరిష్కరించగలుగుతున్నాము. ఇందుకు నిదర్శనంగా వట్టిచెరుకూరు, పుల్లడిగుంట, ఏటుకూరు ప్రాంతాలు నిలుస్తున్నాయి.
* గత ప్రభుత్వం చేసింది ఏమైనా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడమే. ఈ ఆక్ట్ ద్వారా ప్రజల ఆస్తులపై పెత్తనం చేయాలని ఆ పార్టీ నాయకులు ప్రయత్నించారు.
* రీసర్వే విధానాన్ని కూడా 2014 - 19 సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఆధ్వర్యంలో అమల్లోకి వచ్చింది.
* 'నేను అంటే అహంకారం - మేము అంటే మమకారం' అని నమ్మి పనిచేసేటువంటి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ రీసర్వే కార్యక్రమం మరింత వేగం పుంజుకుంది.
* వైసిపి హయాంలో ప్రజలు సంపాదించుకున్న భూముల పట్టా పాస్ బుక్కులపై జగన్ గారి ఫోటోలు ముద్రించుకున్న చరిత్ర ఆ పార్టీదే.
* కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పట్టాదారు పాసుపుస్తకం పై రాజముద్రను ముద్రించి మరీ రైతులకు అందజేస్తున్నాము.
* కానీ ఎక్కడ కూడా ఒక రూపాయి లంచం తీసుకోకుండా ప్రజలకు ఈ సౌకర్యాలను కల్పిస్తున్నాము.
బి. రామాంజనేయులు గారి కామెంట్స్
* నేను కలెక్టర్ గా ఉన్నప్పుడు కూడా పరిష్కారం దానికి సమస్యను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ గారు పరిష్కరించారు.
* సుమారు ఏడాది క్రితం నేను రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరగా, నిబంధనలను అనుసరించి కచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
* ఇచ్చిన హామీ ప్రకారమే ఏడాది తిరిగేలోపు సమస్యను పరిష్కరించారు.
* అందులో భాగంగానే వట్టిచెరుకూరు, పుల్లడిగుంట, ఏటుకూరు ప్రాంతాల్లోని వందల కుటుంబాలకు ఆధీనంలో ఉన్న 22-A భూ సమస్యలను పరిష్కరించి యజమానులకు శాశ్వత హక్కు కల్పించారు.
భాష్యం రామకృష్ణ గారి కామెంట్స్
* ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారి చొరవతో మీ భూమి మీ హక్కు ద్వారా శాశ్వత పరిష్కారం అందుకున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
* ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి పెయింటింగ్ సమస్యను కోటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మాత్రమే పరిష్కారం లభించింది.
ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం గారు, కలెక్టర్ సాయికాంత్ వర్మ గారు, జాయింట్ కలెక్టర్ అసుతోష్ శ్రీ వాత్సవ గారు, ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు.




