Guntur: వట్టిచెరుకూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రులు!

Guntur: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 1 Sept 2026 4:22 PM IST
Guntur
X

Guntur: వట్టిచెరుకూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రులు!

గుంటూరు: గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజవర్గం లోనివట్టిచెరుకూరు మండలంలోని ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, పార్లమెంట్ సభ్యులు భాష్యం రామకృష్ణ, ప్రత్తిపాడు శాసన సభ్యులు డా.బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ వట్టిచెరుకూరులో మంగళవారం పంపిణీ చేశారు.

నూట ఇరవై సంవత్సరాల భూ సమస్యకు పరిష్కారం చేస్తూ వట్టిచెరుకూరు, పుల్లటగుంట, ఏటుకూరు గ్రామాల్లో 812 కుటుంబాలకు శాశ్వత పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింఛన్లు పంపిణీ చేశారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU

Next Story