Parchur: అమెరికా వరదల్లో పర్చూరు యువకుడు వెంకటేష్ గల్లంతు.. ఆందోళనలో కుటుంబం
Parchur: బాపట్ల జిల్లా దేవరపల్లికి చెందిన ఎన్నారై వెంకటేష్ అమెరికా వరదల్లో గల్లంతు. ఆచూకీ కోసం కేంద్ర, రాష్ట్ర మంత్రులకు లేఖ రాసిన ఎమ్మెల్యే ఏలూరి.
Parchur: అమెరికా వరదల్లో పర్చూరు యువకుడు వెంకటేష్ గల్లంతు.. ఆందోళనలో కుటుంబం
పర్చూరు: బాపట్ల జిల్లా, పర్చూరు మండలం, దేవరపల్లికి చెందిన దొప్పలపూడి రాంబాబు, అనురాధ దంపతులకు వెంకటేష్, రామకృష్ణ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకటేష్ (33) ఐదేళ్ళ క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తిచేసుకుని అక్కడే ఉద్యోగం పొంది.. ఓక్లహామా సిటీలో ఉంటున్నాడు.
అమెరికాలోని కాన్సాస్ వెల్లింగ్టన్కు వెళ్లిన వెంకటేష్ అక్కడ వరదల్లో చిక్కుకుని భారీ ప్రవాహానికి కొట్టుకొని పోయినట్లు బంధువులకు సమాచారం అందింది. వెంకటేష్ ప్రయాణించే కారు, అందులో బ్యాగు ఉన్నాయని కుటుంబసభ్యులకు అక్కడి నుంచి సమాచారం వచ్చింది.
కానీ వెంకటేశ్ ఆచూకీ, ఫోన్ లభించకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలిసిన స్తానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ లకు లేఖ రాశారు. వెంటనే వెంకటేశ్ ఆచూకీ గుర్తించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. దీంతో ఆగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.




