Mangalagiri: చంద్రబాబు అరెస్ట్ చీకటి రోజుకు మూడేళ్లు.. టీడీపీ నిరసన!
Mangalagiri: చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చీకటి రోజును గుర్తుచేసుకున్న నాయకులు.
Mangalagiri: చంద్రబాబు అరెస్ట్ చీకటి రోజుకు మూడేళ్లు.. టీడీపీ నిరసన!
Mangalagiri: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని ఒక అసత్య కేసులో చట్టవిరుద్ధంగా నిర్బంధించి నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డా. ఎంఎస్ఎస్ భవన్‌లో టీడీపీ నాయకులు ఆ చీకటి రోజును గుర్తుచేసుకున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం రాష్ట్ర ప్రజలతో పాటు దేశవిదేశాల్లోని తెలుగు వారందరూ ఆయనకు మద్దతుగా తరలివచ్చారని నాయకులు పేర్కొన్నారు.
దేవుని సంకల్పం ప్రకారం చంద్రబాబు నిర్దోషిగా నిరూపించబడ్డారని, చివరికి నిజమే గెలిచిందని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ, “సెప్టెంబర్ 9 తెలుగు జాతి చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేని చీకటి రోజు. గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం చంద్రబాబుపై కుట్రపన్నారు.
కష్టకాలంలో చంద్రబాబుకు తెలుగుజాతి మొత్తం అండగా నిలిచింది. చంద్రబాబు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు. ఆయన చేసిన సేవలు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. చివరికి నిజం గెలిచింది.. నిర్బంధం నుంచి చంద్రబాబు విడుదలయ్యారు” అని అన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఆయనకు అండగా నిలిచిన ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి అభిమానం, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ మరువలేనిదని నాయకులు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చూపిన ఐక్యత చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, గోవాడ దుర్గారావు, మాదల రమేష్, గుమ్మా హరిబాబు,తోట శ్రీనుబాబు, రుద్రు శ్రీనివాసరావు, కౌతరపు శ్రీనివాసరావు,గంట దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




