Bapatla: తల్లికి వందనం పథకం ప్రతి విద్యార్థికి అందాలి: కలెక్టర్!

Bapatla: తల్లికి వందనం పథకం ప్రతి విద్యార్థికి అందేలా చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 29 July 2026 10:07 AM IST
Bapatla
X

Bapatla: తల్లికి వందనం పథకం ప్రతి విద్యార్థికి అందాలి: కలెక్టర్!

Bapatla: తల్లికి వందనం పథకం ప్రతి విద్యార్థి కి అందాలి. జిల్లా కలెక్టర్

తల్లికి వందనం పథకం ప్రతి విద్యార్థికి అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. తల్లికి వందనం పథకం, వాట్సాప్ గవర్నెన్స్ అమలు తీరుపై జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు.

తల్లికి వందనం నగదు పంపిణీ బాపట్లలో సమర్ధంగా సాగిందని కలెక్టర్ చెప్పారు. లబ్ధిదారులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు నగదు చేరిందన్నారు. సాంకేతిక కారణాలవల్ల కేవలం 5,986 మందికి నగదు చేరక పోవడంపై ఆరా తీశారు. తక్షణమే పరిష్కరించి లబ్ధిదారులకు నగదు అందేలా చూడాలన్నారు.

వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ప్రజలలో విస్తృతంగా చైతన్యం తీసుకురావాలన్నారు. వాట్సాప్ పరిపాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లిన సేవలు సద్వినియోగం చేసుకునేలా చైతన్య పరచాలన్నారు. ఇంకొల్లు మండలంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రజలకు బాగా అందుతుండగా, చీరాల మండలంలో సరిగా అందకపోవడంపై అరా తీశారు. ప్రతి మండలంలో వంద చొప్పున సేవలు జరగాలని ఆయన సూచించారు. సచివాలయాల ద్వారా ప్రజలలోకి వాట్సాప్ గవర్నమెంట్ సేవలను తీసుకువెళ్లాలన్నారు.

ఈ సమావేశంలో డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్, డీఈవో శ్రీనివాసు సింగ్, స్వర్ణ గ్రామ, వార్డ్ సచివాలయాల ఇంచార్జ్ అధికారి రాజేష్, ఎంపీడీవోలు, ఎంఈఓ లు, తదితరులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story