Tadepalli: 3.3 కిలోల గంజాయి స్వాధీనం, ముగ్గురి అరెస్ట్

Tadepalli: తాడేపల్లి పోలీసులు విజయవాడ గుంటూరు ఛానల్ లాక్స్ వద్ద దాడి చేసి 3.3 కిలోల గంజాయితో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 1 Sept 2026 8:07 PM IST
Tadepalli
X

Tadepalli: 3.3 కిలోల గంజాయి స్వాధీనం, ముగ్గురి అరెస్ట్

తాడేపల్లి: గంజాయి అక్రమ రవాణాపై తాడేపల్లి పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 3.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని గుంటూరు ఛానల్ లాక్స్ సమీపంలో గంజాయి విక్రయానికి ప్రయత్నిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను విచారించగా గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. అరెస్టైన నిందితుల్లో పల్లపు వినయ్, తాడికొండ భాను నితీష్, మానుపాటి వర్ష ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో Cr.No.584/2026, NDPS Act-1985 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులకు గతంలో కూడా గంజాయి సంబంధిత కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, 3.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA

Next Story