Savalyapuram: PHCలో కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల పోస్టుకార్డు నిరసన!
Savalyapuram: శావల్యాపురం PHC వద్ద కాంట్రాక్ట్ వైద్య, పారామెడికల్ ఉద్యోగుల పోస్టుకార్డు నిరసన. తమను రెగ్యులరైజ్ చేయాలని సీఎంకు ఉత్తరాలు రాసిన జేఏసీ నేతలు.
Savalyapuram: PHCలో కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల పోస్టుకార్డు నిరసన!
Savalyapuram: కాంట్రాక్ట్ వైద్య, పారామెడికల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ కాంట్రాక్ట్ మెడికల్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పోస్టుకార్డు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
ఉద్యోగులు ముఖ్యమంత్రి పేరుతో పోస్టుకార్డులు రాసి, తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరామని ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, 100 శాతం గ్రాస్ వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలందిస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు.
వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ.. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 వేల మంది కాంట్రాక్ట్ వైద్య, పారామెడికల్ ఉద్యోగులు ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు పంపిస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి.. రెగ్యులరైజేషన్తో పాటు 100 శాతం గ్రాస్ వేతనం అమలు చేయాలని ఉద్యోగులు కోరారు.




