Sattenapalli: సత్తెనపల్లి ఎస్‌డీపీవోగా బాధ్యతలు స్వీకరించిన చైతన్య

Sattenapalli: సత్తెనపల్లి సబ్-డివిజన్ పోలీసు అధికారిగా (ఎస్‌డీపీవో) సోమవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన ఎం.వి.కె. చైతన్య.

V SRIKANTH, SATTENNAPALLI
Published on: 27 July 2026 6:37 PM IST
Sattenapalli
X

Sattenapalli: సత్తెనపల్లి ఎస్‌డీపీవోగా బాధ్యతలు స్వీకరించిన చైతన్య

సత్తెనపల్లి: ఎం.వి.కె. చైతన్య ఈరోజు అనగా 27-07-2026 ఉదయం 11.45 గంటలకు సత్తెనపల్లి సబ్-డివిజన్ పోలీసు అధికారి (ఎస్.డి.పి.ఓ.)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు సత్తెనపల్లి సబ్-డివిజన్ ఎస్.డి.పి.ఓ.గా విధులు నిర్వహించిన శ్రీ ఎం. హనుమంతరావు నుండి ఎం.వి.కె. చైతన్య అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

నూతన ఎస్.డి.పి.ఓ ఎం.వి.కె. చైతన్య మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి, ఏవైనా సమస్యలు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI

Next Story