Sattenapalli: సత్తెనపల్లిలో రాయితీ ధరకు నాణ్యమైన బియ్యం విక్రయాలు

Sattenapalli: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రాయితీ ధరకు బియ్యం విక్రయాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు.

V SRIKANTH, SATTENNAPALLI
Published on: 5 Aug 2026 8:58 PM IST
Sattenapalli
X

Sattenapalli: సత్తెనపల్లిలో రాయితీ ధరకు నాణ్యమైన బియ్యం విక్రయాలు

సత్తెనపల్లి: పట్టణంలోని వావిలాల కాంప్లెక్స్ లో ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఏలినినో ప్రభావం కారణంగా సరైన వర్షాలు కురవక, వరి పంటను సాగు చేసే పరిస్థితి లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ఎటువంటి రాజీ పడకుండా అత్యంత నాణ్యమైన మంచి బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీరుపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గత జగన్ హయాంలో ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని, ప్రజలను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా, ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వంపై బురదజల్లేలా దుష్ప్రచారాలకు పాల్పడటమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI

Next Story