Bapatla: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. మట్టి వినాయకుల పంపిణీ!

Bapatla: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఉచితంగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని క్లబ్ అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు పిలుపు.

B SURESH, BAPATLA
Published on: 12 Sept 2026 12:50 PM IST
Bapatla
X

Bapatla: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. మట్టి వినాయకుల పంపిణీ!

Bapatla: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించాలని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రోటరీ క్లబ్ ఉపాధ్యక్షుడు కొత్త ఆంజనేయ ప్రసాద్ సౌజన్యంతో ఈ నెల 14న సోమవారం ఉదయం 6 గంటలకు రథం బజార్‌లోని వాసవి కన్యకా పరమేశ్వరి షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏటా పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు.

చిన్న చిన్న మంచి పనులే పర్యావరణ పరిరక్షణకు పునాదిగా నిలుస్తాయన్నారు. రసాయన రంగులతో తయారైన విగ్రహాలకు బదులుగా పర్యావరణానికి హాని కలిగించని మట్టి ప్రతిమలను వినియోగించాలని సూచించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వినాయక ప్రతిమల నిమజ్జనం సందర్భంగా కూడా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం భక్తులకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

B SURESH, BAPATLA

B SURESH, BAPATLA