Repalle: ప్రజా దర్బార్.. బాధితుల సమస్యలను నేరుగా విన్న మంత్రి సత్య!
Repalle: టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో రాష్ట్ర రెవెన్యూ మంత్రి సత్య ప్రసాద్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు.
Repalle: ప్రజా దర్బార్.. బాధితుల సమస్యలను నేరుగా విన్న మంత్రి సత్య!
రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న మంత్రి.రేపల్లె నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మంత్రి అనగాని సత్య ప్రసాద్‌కు స్వయంగా వినతి పత్రాలను అందజేశారు.
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి, అక్కడికక్కడే వాటిని పరిశీలించారు.సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించిన మంత్రి.
కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ప్రజల ముంగిటకే పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం.కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రభుత్వ అధికారులు.




