Mangalagiri: టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న గొల్లపల్లి అమూల్య!

Mangalagiri: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య.

PRABHU, RAZOLE
Published on: 7 Sept 2026 1:36 PM IST
Mangalagiri
X

Mangalagiri: టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న గొల్లపల్లి అమూల్య!

Mangalagiri: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్‌లో రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం, సంస్థాగత బలోపేతం, ప్రజలకు పార్టీ కార్యక్రమాలను మరింత చేరువ చేయడం వంటి అంశాలపై కాంక్లేవ్‌లో చర్చించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకత్వం సూచనలు, భవిష్యత్ కార్యాచరణపై అమూల్య అవగాహన పొందారు. రాజోలు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతామని ఆమె పేర్కొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story