Mangalagiri: మంగళగిరిలో ఏపీఎల్ సీజన్ 5 షురూ.. చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్!

Mangalagiri: మంగళగిరి ఏసీఏ స్టేడియంలో జిఎంఆర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 5 సందడి షురూ అయింది.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 24 Jun 2026 8:06 AM IST
Mangalagiri
X

Mangalagiri: మంగళగిరిలో ఏపీఎల్ సీజన్ 5 షురూ.. చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్!

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు, సినీ ప్రియులకు రేపు ఒక పెద్ద పండుగ రోజు కానుంది. మంగళగిరిలోని ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న 'జిఎంఆర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 5' ప్రారంభ వేడుకలకు గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.

ఐటీ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ జూన్ 24 నుండి జూన్ 30 వరకు మంగళగిరి వేదికగా సాగనుంది.

నేటి రామ్ చరణ్ షెడ్యూల్

మధ్యాహ్నం 3:30 గంటలకు: రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో విజయవాడ (గన్నవరం) విమానాశ్రయానికి చేరుకుంటారు.

సాయంత్రం 4:00 నుండి 5:00 గంటల మధ్య: ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా రోడ్డు మార్గాన మంగళగిరిలోని ACA ఇంటర్నేషనల్ స్టేడియానికి చేరుకుంటారు.

ప్రారంభోత్సవం: స్టేడియంలో ఏపీఎల్ సీజన్ 5 టోర్నమెంట్ అధికారిక టీజర్‌ను ఆవిష్కరించి, తొలి మ్యాచ్‌ను టాస్ వేసి రామ్ చరణ్ ప్రారంభిస్తారు.

ఇటీవలే విడుదలైన రామ్ చరణ్ మల్టీ-స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' చిత్రం థియేటర్లలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఒక భారీ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించడానికి వస్తుండటంతో అటు క్రీడా వర్గాల్లోనూ, ఇటు మెగా అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ రాకను పురస్కరించుకుని మంగళగిరి స్టేడియం పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI

Next Story