Prathipadu: ప్రత్తిపాడులో 53 కొవ్వొత్తులతో నిజం గెలిచింది వేడుక!

Prathipadu: ప్రత్తిపాడులో చంద్రబాబు జైలు విడుదలకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో 53 కొవ్వొత్తులు వెలిగించారు.

AYYAPPA SWAMI, PRATTIPADU
Published on: 10 Sept 2026 12:51 PM IST
Prathipadu
X

Prathipadu: ప్రత్తిపాడులో 53 కొవ్వొత్తులతో నిజం గెలిచింది వేడుక!

Prathipadu: టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులో అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో ఉంచిన ఘటనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్తిపాడులో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో 53 కొవ్వొత్తులు వెలిగించి కార్యక్రమాన్ని నిర్వహించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో పెట్టారని,చంద్రబాబును ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆయన ధైర్యంగా న్యాయపోరాటం కొనసాగించారని పేర్కొన్నారు.చివరకు నిజం గెలిచిందని,న్యాయమే నిలిచిందని అన్నారు.

చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో టీడీపీ శ్రేణులు ఎదుర్కొన్న కష్టాలను ప్రజలు మరిచిపోలేదని,ఆ సమయంలో ప్రజలు చంద్రబాబుకు అండగా నిలిచారని అన్నారు.వైసీపీ పాలనలో జరిగిన కక్ష సాధింపు రాజకీయాలకు ప్రజలు ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో వైసీపీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేయడం ద్వారా ప్రజలు తమ తీర్పును స్పష్టంగా ఇచ్చారని అన్నారు.ప్రజల తీర్పుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని,ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులు,పరిశ్రమలు తీసుకురావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం,మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.అక్రమ కేసులు,

రాజకీయ వేధింపులతో చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాలేదని అన్నారు.53 రోజుల జైలు జీవితం తర్వాత ప్రజల అండతో మరింత బలంగా తిరిగి వచ్చిన చంద్రబాబు,ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ స్పష్టం చేశారు.

కొవ్వొ త్తులు వెలిగించడం ద్వారా చీకటిపై వెలుగు,అసత్యంపై నిజం,అన్యాయంపై న్యాయం సాధించిన విజయానికి ప్రతీకగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు,టీడీపీ నాయకులు అమరాది వెంకటరావు, మంతెన వెంకటరమణ,యర్రాబత్తుల గోవిందు నాయుడు,

మిరియాల శ్రీను,జువ్విన తిరుపతిరావు,బొల్లు కొండబాబు,వెలుగుల నాని,సుంకర సోమరాజు,కొప్పన నాని,సత్యంశెట్టి సీతబాబు,బొల్లు చిన్నా,బొండాడ నారాయుడు,పుణ్యమంతుల శ్రీను,పోలిశెట్టి శ్రీనివాస్,మదినే దొరబాబు,పత్రి రమణ,పల్లా గోపి, దాకారపు కృష్ణ,చీకట్ల నాని,ముప్పనబోయిన ఏసుబాబు,రావూరి తాతాజీ తదితరులు పాల్గొన్నారు

AYYAPPA SWAMI, PRATTIPADU

AYYAPPA SWAMI, PRATTIPADU

Next Story