Ponnuru: పొన్నూరులో రూ. 15.71 కోట్లతో రోడ్డు పనుల శంకుస్థాపన

Ponnuru: పొన్నూరు నియోజకవర్గంలో రూ. 15.71 కోట్ల రోడ్డు పనులకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర శంకుస్థాపనలు చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 5 Sept 2026 4:42 PM IST
Ponnuru
X

Ponnuru: పొన్నూరులో రూ. 15.71 కోట్లతో రోడ్డు పనుల శంకుస్థాపన

పొన్నూరు: పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలంలో గల కొప్పురావూరు, అనుమర్లపూడి అలాగే చేబ్రోలు మండలంలోని సేకూరు, తోట్లపాలెం అనంతరం పొన్నూరు మండలంలోని దోప్పలపూడి, జడవల్లి గ్రామాలలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో, రూ. 15.71 కోట్ల నిధులతో, పలు రహదారుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనలను గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారితో కలిసి శనివారం నిర్వహించారు.

పెమ్మసాని గారి కామెంట్స్

* ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామములో తిరగాలని ప్రయత్నించాను కానీ, కొన్ని గ్రామాలలో తిరగలేక పోయాము.

* కానీ పొన్నూరు నియోజకవర్గంలో మాత్రమే ప్రతి గ్రామంలో నరేంద్ర గారు మమ్మల్ని పర్యటింపజేశారు.

* ఈరోజు కూడా ఉదయం నుంచి ఇప్పటివరకు గ్రామ గ్రామాన పర్యటిస్తూనే ఉన్నాము. ప్రజల అభిమానమే మాకు ముఖ్యమని నమ్మి మీ వద్దకు వస్తున్నాము.

* ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్న ఈ రోడ్లు మాత్రమే కాదు పొన్నూరు నియోజకవర్గం మొత్తం చూసుకుంటే కొన్ని కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

* వైసిపి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం వేసిన రోడ్లు ఏమీ లేవు.

* గుంటూరులో ఎన్నో బ్రిడ్జిల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తున్నాము.

* ప్రతి ఏటా ఒక్కో MP కి రూ. 5 కోట్ల నిధులు ఉంటాయి. అయితే అందులో రూ.2 కోట్లను ఒక పొన్నూరుకే నేను అందజేస్తున్నాను.

* కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ పంచాయతీరాజ్, మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో గుంటూరు జిల్లాలో ఎన్నో చెరువులను కూడా అభివృద్ధి పరుస్తున్నాము.

* 22A భూముల సమస్యలnu కూడా పరిష్కరించి యజమానులకు అందజేస్తున్నాము.

* అవసరాలకు మించి యూరియా బస్తాలు అందజేస్తున్నప్పటికీ ఎక్కువమంది అవసరానికి మించి ఎవరెవరో కొనుగోలు చేయడం వల్ల యూరియా బస్తాల కొరత ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ ఆ సమస్య తలెత్తకుండా సాంకేతిక విధానం ద్వారా, ఓటిపి విధానాన్ని అందుబాటులోకి తెచ్చి సమస్యను పరిష్కరిస్తున్నాము.

ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గారి కామెంట్స్

* ఏ సందర్భంలో అయినా, ఎప్పుడైనా ఈ గ్రామం వచ్చిన ప్రతిసారి గ్రామస్తులందరూ రోడ్ల నిర్మాణం గురించి అడుగుతుండేవారు.

* ఆ రోడ్డు నిర్మాణం కోట్లాది రూపాయలతో ముడిపడి ఉంది కాబట్టి పూర్తిస్థాయి పనులన్నీ చేసిన తర్వాతే మీ దగ్గరకు రావాలని నిర్ణయించుకున్నాము, అందుకే ఇంత ఆలస్యమైంది.

* కొన్ని పనులు చేయడానికి కొంత ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా పూర్తి చేస్తాం అనడానికి ఈ రోడ్ల నిర్మాణమే ఒక ఉదాహరణ.

* ఇవాళ శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాం, పులిచింతల ప్రాజెక్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఎవరైతే పట్టిసీమ వల్ల ఉపయోగం లేదని చెప్పారో.. చివరకు ఆ పార్టీ సీను ద్వారానే మనందరికీ నీళ్ళు అందుతున్నాయి.

* బ్రిడ్జి విషయంలో చాలామంది కంగారు పడుతున్నారు. యాక్సిడెంట్ వల్ల బ్రిడ్జ్ పై రైలింగ్ విరిగింది తప్ప బ్రిడ్జికి వచ్చిన సమస్య ఏమీ లేదు. నెలరోజుల్లో ఆ బ్రిడ్జి మరమ్మతులు పూర్తి చేస్తాం

* కొత్త బ్రిడ్జి పనులు కూడా త్వరగా పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటాం.

* నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు అంత తిరిగి వస్తుంది అనే తీరున కొందరు చెప్పే ప్రలోభ మాటలు నమ్మవద్దు అనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను.

* ఈరోజు మన కేంద్రమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన చేసుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను.

నియోజవర్గంలో నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వడ్రానం మార్కండేయ బాబు గారు, పెదకాకాని మండల టిడిపి ప్రెసిడెంట్ వలివేటి మురళి గారు, అనుమర్లపూడి గ్రామంలో హరికృష్ణ గారు, సింహాద్రి శ్రీ హరి గారు, బెల్లంకొండ కోటేశ్వరావు గారు, దాసరి వాసు గారు, ప్రసాద్ గారు అలాగే సేకూరు గ్రామంలో చేబ్రోలు మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ మైలా వెంకట రామరాజు గారు, శేఖర్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉయ్యూరు సత్యనారాయణ గారు, చేబ్రోలు మండల తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు ఉయ్యూరు నాగరాజు గారు అలాగే తోట్లపాలెం, దోప్పలపూడి గ్రామ టిడిపి ప్రెసిడెంట్లు, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story