Ponnuru: పొన్నూరులో వర్షాల కోసం ప్రత్యేక నమాజ్!

Ponnuru: గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వర్షాలు కురవాలని ప్రత్యేకంగా సలాతుల్ ఇస్తిస్కా నమాజ్ నిర్వహించిన ముస్లిం సోదరులు అల్లాహ్ కరుణ కోసం ఈద్గాలో ప్రార్థనలు.

SHAREEF, PONNURU
Published on: 30 Aug 2026 1:02 PM IST
Ponnuru
X

Ponnuru: పొన్నూరులో వర్షాల కోసం ప్రత్యేక నమాజ్!

Ponnuru: వర్షాలు లేక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అల్లాహ్ కరుణతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ పొన్నూరు పట్టణ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఈద్గా ప్రాంగణంలో ప్రత్యేకంగా సలాతుల్ ఇస్తిస్కా (వర్షాల కోసం నమాజ్) నిర్వహించారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులు రెండు రకాతుల నమాజ్‌ నిర్వహించి, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల పంటలు పండాలని, ప్రజలకు కష్టాలు తొలగాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ప్రత్యేక దువా చేశారు.

కార్యక్రమంలో పట్టణంలోని పలువురు ముస్లిం పెద్దలు, మతపెద్దలు, యువకులు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి కరుణించి త్వరగా విస్తారంగా వర్షాలు కురవాలని, ప్రతి ఒక్కరి జీవనంలో సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU

Next Story