Ponnuru: మధ్యవర్తిత్వంతో వివాదాలకు శీఘ్ర పరిష్కారం: జడ్జి రుక్మిణి!

Ponnuru: పొన్నూరులో మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు, ర్యాలీ. మధ్యవర్తిత్వంతో సమస్యలు త్వరగా పరిష్కరించుకోవాలన్న జడ్జి రుక్మిణి.

SHAREEF, PONNURU
Published on: 7 Aug 2026 2:21 PM IST
Ponnuru
X

Ponnuru: మధ్యవర్తిత్వంతో వివాదాలకు శీఘ్ర పరిష్కారం: జడ్జి రుక్మిణి!

గుంటూరు జిల్లా పొన్నూరు

మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోండి: జూనియర్ సివిల్ జడ్జి జి .రుక్మిణి

పొన్నూరులో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు, అవగాహన ర్యాలీ. పొన్నూరు మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం ద్వారా దేశం కోసం 3.0 (Mediation for the Nation 3.0) కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి.

ఈ సందర్భంగా పొన్నూరు కోర్టు ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి. రుక్మిణి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు చట్టాలు, న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జడ్జి జి. రుక్మిణి మాట్లాడుతూ.. ప్రజలు తమ వివాదాలను కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయకుండా, పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని వివరించారు.

పట్టణంలో అవగాహన ర్యాలీ

న్యాయ విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పొన్నూరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పొన్నూరు బార్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక న్యాయవాదులు, న్యాయవాద గుమస్తా సంఘం సభ్యులు, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU

Next Story