Ponnuru: హజ్ యాత్ర ఉద్యోగాల పేరిట మోసం పొన్నూరులో ఖాజీపై ఫిర్యాదు
Ponnuru: హజ్ యాత్రికుల సేవకుల ఉద్యోగాల పేరిట పొన్నూరులో 22 మంది వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఖాజీ సయ్యద్ తయ్యబ్. బాధితుల ఫిర్యాదు.
Ponnuru: హజ్ యాత్ర ఉద్యోగాల పేరిట మోసం పొన్నూరులో ఖాజీపై ఫిర్యాదు
పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు ముస్లిం అతి పవిత్రంగా చేసే హజ్ యాత్రకు సంబంధించి వచ్చే భక్తులకు సేవలు అందించే సేవకులుగా అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికి పొన్నూరు పట్టణానికి చెందిన 22 మంది వద్ద లక్షల్లో నగదు వసూలు చేసి ముఖం చాటేసిన బాపట్ల జిల్లా రేపల్లె ప్రభుత్వ ఖాజీ సయ్యద్ తయ్యబ్
మక్కా మదీనా దర్శనానికి వచ్చే హజ్ యాత్రికుల సహాయకులుగా పని చేసే ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించిన ఖాజీ తయ్యబ్ తన సోదరుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సయ్యద్ తాహిర్ మరియు పొన్నూరు కు చెందిన కొంతమంది సహకారంతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. పట్టణంలోని పేద ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఒక్కొకరి వద్ద 60 నుంచి 70 వేల వరకు 6 నెలల క్రితం వసూలు చేశారు.
పట్టణంలో 22 మంది వరకు ఉండగా అందులో ఏడుగురు మహిళలు ఉండటం గమనార్హం. 6 నెలలు గడిచిన వారిని పంపకుండా కాలయాపన చేస్తుండటంతో బాధితులు ఖాజీ తయ్యబ్ ను నిలదీయడం జరిగింది. ముస్లిం పెద్దల సమక్షంలో నగదు తిరిగి ఇస్తామని ఖాజీ తయ్యబ్, సోదరుడు తాహిర్లు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటివరకు ఎవరికి నగదు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ప్రజా గ్రీవెన్స్ లో తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు
రోజువారి కూలి పనులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతికే తమను దేవుని పేరుతో ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు




